మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ కీలక ఆరోపణలు చేశారు. బుధవారం తెంలగాణ భవన్ లో గెల్లు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవి పోవడం ఖాయమని అన్నారు. మంత్రి పదవి కాపాడుకోవడం కోసమే బీఆర్ఎస్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కోమటిరెడ్డి సోదరులకు క్రెడిబిలిటీ లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆశీర్వాదం కోసం తాపత్రయ పడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక గురుకుల పాఠశాలల పట్ల వివక్ష చూపుతున్నారని అన్నారు.
దీంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యాశాఖ పై ఒక్క సమీక్ష అయినా నిర్వహించారా..? అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ హయాంలో విద్యార్థుల బలిదానాలు ఎక్కువగా జరిగాయని గుర్తు చేశారు. సంక్షేమ శాఖలు అన్నీ కూడా సీఎం దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు.