సీఎం కేసీఆర్ పై  కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై భువనగిరి ఎంపీ కోమటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఊ అంటే 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం అభివృద్ధి చేసింది అనడం విడ్డూరం అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు, యూనివర్సిటీలను నిర్మించింది ఎవరు అని ప్రశ్నించారు కోమటిరెడ్డి.  తాము ఉచిత కరెంట్ ఇచ్చినప్పుడు కేసీఆర్ టీడీపీలో ఉన్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో యూనివర్సిటీలను కట్టింది కాంగ్రెస్ కాదా..? కాంగ్రెస్ ఏం చేసిందో నీకు అన్ని తెలుసు.. నువ్వు అన్ని బుక్కులు చదివావు అంటావు. కాంగ్రెస్ ఏం చేసిందో తెలియదా అని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్  జవహర్ లాల్ నెహ్రు సాగర్ శంకుస్థాపన చేస్తే ఇందిరా గాంధీ ఓపెన్ చేసింది. చెప్పుకుంటూ పోతే 50 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చాలా ఉందన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ కి 2వేల కోట్లు చెల్లిస్తే ప్రాజెక్ట్ పూర్తయ్యేదని పేర్కొన్నరు.  శ్రీశైలం ప్రాజెక్ట్, శ్రీరామ్ ప్రాజెక్ట్ కట్టింది ఎవరు అని ప్రశ్నించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 9 ఏళ్లలో ఏం చేశారు.. 5 లక్షల కోట్లు అప్పు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version