సీతక్క సీఎం కావడం పెద్ద జోక్ – కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

-

సీతక్క సీఎం కావడం పెద్ద జోక్ అంటూ ఫైర్‌ అయ్యారు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. సీతక్క సీఎం అంటూ రేవంత్‌ చేసిన వ్యాఖ్యలకు కోమటిరెడ్డి వెంకట్‌ కౌంటర్ ఇచ్చారు. గిరిజనులు సీఎం కావాలి అంటే పొడెం వీరయ్య ఏం పాపం చేశాదని.. దళితులకు కూడా ఇవ్వాలని నేను చెప్పానని తెలిపారు. భట్టి.. దామోదర రాజనర్సింహ ఉన్నారని…సీఎం ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు.

సీఎం ఎవరనేది..సీనియారిటీ కూడా చూస్తారని… గిరిజనులు..దళితులకు సీఎం ఇవ్వాలని నేను కూడా అంటున్నానని చెప్పారు. అటు రైతులకు 3 గంటల కరెంట్ మాత్రమే ఇవ్వాలి అన్న రేవంత్ రెడ్డి మాటలకు కౌంటర్ ఇచ్చారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాటలు ఆయన వ్యక్తిగతమైనవి. ఆయన చెప్తే ఫైనల్ అవుతుందా? అని ఫైర్‌ అయ్యారు కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుందని… స్టార్ క్యాంపెనర్‌గా నేను చెప్తున్నా 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. నేను రేవంత్ రెడ్డి కేవలం పార్టీకి కోఆర్డినేటర్స్ మాత్రమేనని… సీఎం ఎవరు అనేది పార్టీ నిర్ణయిస్తుందని తేల్చి చెప్పారు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. రేవంత్ అప్పట్లో కాంగ్రెస్ లో లేరు కాబట్టి ఉచిత విద్యుత్ కోసం ఎంత కాటపడ్డామో ఆయనకు తెలియదన్నారు. అమెరికా పోయాక..రేవంత్‌ రెడ్డి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అంటూ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version