మంత్రి పదవీ పోతుందని కోమటిరెడ్డి భయపడుతున్నారు : మహేశ్వర్ రెడ్డి

-

అవినీతి, అరాచకాలు గత ప్రభుత్వం లో జరిగిన దానికన్నా ఎక్కువ జరుగుతున్నవని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి కి పాల్పడ్డ వారిని కటకటాల వెనక్కి పంపిస్తా అన్న ముఖ్యమంత్రి..ఇప్పుడు లోలోపల సెటిల్మెంట్ లు బయటకు వస్తున్నాయి. రేవంత్ అంటే నా వంతు ఎంత అని అడుగుతున్నాడు అట. రేటెంత రెడ్డి నీ రేట్ ఎంతా అని వెళ్లిన వారు అడుగుతున్నారు అట. గత ప్రభుత్వం లో జరిగిన అవినీతి నీ ముందు పెట్టుకొని సెటిల్మెంట్ చేసుకుంటున్నాడు.

15 ఎకరాలు గత ప్రభుత్వం హేటిరో డ్రగ్స్ కి ఇచ్చింది. 15 వందల కోట్ల విలువైన భూమి ఈ ప్రభుత్వం ఆ కేటాయింపు ను రద్దు చేసింది. అది ప్రభుత్వ స్థలం గా బోర్డు పెట్టింది. ఏమైందో తెలియదు జీఓ 37 ద్వారా అదే భూమి నీ మళ్ళీ హీటిరో కు(పార్థ సారథి రెడ్డి) రేవంత్ రెడ్ది ఇచ్చారు. 300 కోట్లను తీసుకొని డిల్లీకి పంపించిన మాట వాస్తవమా కాదా..? అని ప్రశ్నించారు మహేశ్వర్ రెడ్డి. సుడో ప్రభుత్వం నీ తన మనషులను పెట్టుకొని రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డీ ఇంటికి పోయే సరికి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అభద్రతా భావం తో రేవంత్ నీ పొగుడుతున్నారు. తన మంత్రి పదవీ పోతుందేమోనని భయపడుతున్నారు. షిండే లు లేకపోతే రేవంత్ రెడ్డి నా వెనుక కుట్ర జరుగుతుంది అని ఎందుకు అన్నాడని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version