మార్చి 1 నుంచి పాదయాత్ర, బైక్‌ యాత్ర చేస్తా – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

-

మార్చి 1 నుంచి పాదయాత్ర, బైక్‌ యాత్ర చేస్తానని తెలిపారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. తెలంగాణలో పొత్తులపై కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌, కాంగ్రెస్‌ కలువబోతున్నాయంటూ బాంబ్‌ పేల్చారు. కాంగ్రెస్‌తో కేసీఆర్‌ కలవక తప్పదు.. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ సెక్యులర్‌ పార్టీలు, ఎవరికీ 60 సీట్లు రావని తెలిపారు. తెలంగాణలో వచ్చేది హంగ్‌ మాత్రమేనని వెల్లడించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

కాంగ్రెస్‌ గాడిలో పడుతోంది.. కొత్తైనా, పాత అయినా గెలిచే వారికే టికెట్‌ ఇవ్వాలని తెలిపారు. ఒంటరిగా పోరాడుతాం.. ఎన్నికల తర్వాత పొత్తులు తప్పవని స్ఫస్టం చేశారు. మార్చి 1 నుంచి పాదయాత్ర, బైక్‌ యాత్ర చేస్తానని ప్రకటించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. కేసీఆర్ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పొగుడుతూ బిజెపి నీ తిట్టారని గుర్తు చేశారు. మన్మోహన్ నిజాయితీ పరుడుగా పని చేశారని… సీఎం కేసీఆర్‌… కాంగ్రెస్ ను పొగడాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పాలి… మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎందుకు కొన్నారని నిలదీశారు. మేం బిజెపి తో కలవం

 

Read more RELATED
Recommended to you

Exit mobile version