6 నెలల్లోనే పల్లా రాజేశ్వర్ రెడ్డి పదవి పోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బచ్చన్నపేటలో రోడ్ షోలో ముగుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… బిఆర్ఎస్ పార్టీ పనైపోయింది,పార్టీ సచ్చిపోయిందన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి లీడర్ కాదు,ఒక బ్రోకర్…తెలంగాణ ఉద్యమంలో ఉన్నడా…అని నిలదీశారు.
కేసీఆర్ కు కాళ్ళు పట్టుకొని,మందు,సోడా పోసి సిట్టింగ్ కాండిడేట్ నీ కాదని టికెట్ తెచ్చుకున్నాడు…పల్లా అధికారాన్ని దుర్వినియోగం చేసి దొంగ ఓట్లు సృష్టించి గెలిచాడని ఫైర్ అయ్యారు. జనగామ ప్రజలు ఒక ఆర్థిక ఉగ్రవాదిని గెల్పించారు…కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు కోర్టులో దర్యాప్తు జరగుతుందన్నారు. కోర్టులో రుజువు అయితే పల్లా,హరీష్ రావు తో పాటు 30 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు అవుతుందని…అప్పుడు జనగామకు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నే ఎమ్మెల్యేనని తెలిపారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి.