బీఆర్ఎస్ కార్యకర్తలకే దళిత బంధు.. కేసీఆర్ పై కోమటిరెడ్డి ఫైర్..!

-

ఎన్నికల కోసమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు తీసుకొచ్చారని ఎంపీ కోమటరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు చేశారు. నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోమటి రెడ్డి మీడియాతో మాట్లాడారు. దళిత బంధు బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారని.. బీసీ బంధు కూడా ఎన్నికల తరువాత మాయమవుందుందన్నారు. తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్లపై ఉన్నారని.. కేసీఆర్ నిరుద్యోగులకు అన్యాయం చేశాడని దుయ్యబట్టారు.

“బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ పూర్తి చేస్తే కోమటిరెడ్డికి పేరు వస్తుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పనులు చేయడం లేదు. సిద్దిపేటలో లక్ష కోట్లు పెట్టి ప్రాజెక్ట్ పూర్తి చేసి నన్ను పదేండ్లు ఏడిపిస్తావా ? మూడు నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రాజెక్టు పూర్తి చేసి అన్ని గ్రామాలకు సాగు నీళ్లు ఇస్తానని పేర్కొన్నారు. కుటుంబ పాలన పోతేనే పేదలు, నిరుద్యోగుల జీవితాలు బాగుపడుతాయి. కేసీఆర్ దళిత బంధు పథకం ఓట్ల కోసమే తీసుకొచ్చారు. దళిత బంధు పేరుతో రూ.10లక్షలు ఇస్తే.. అందులో 3 లక్షలు కమీషన్ తీసుకుంటున్నారు” అని ధ్వజమెత్తారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version