100 శాతం బీజేపీలో BRS…విలీనం అవుతుంది – తెలంగాణ మంత్రి

-

komatireddy venkat reddy: 100 శాతం బీజేపీలో BRS…విలీనం అవుతుంది అంటూ బాంబ్‌ పేల్చారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్లగొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ….30 ఏళ్ళళ్లలో ప్రస్తుత బడ్జెట్ అత్యుత్తమమైనదని తెలిపారు. గాడి తప్పిన రాష్ట్ర బడ్జెట్ ను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు.

komatireddy venkat reddy

కేంద్రం తన బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేస్తే కేసీఆర్ ఎందుకు స్పందించలేదని… బీజేపీ తో BRS విలీనం కోసం చర్చలు జరుపుతున్నట్లు మాకు సమాచారం ఉందని బాంబ్‌ పేల్చారు. BRS చేసిన అప్పులు కాంగ్రెస్ వడ్డీలు కట్టవలసి వస్తుందని… కేసీఆర్ స్థానంలో నేను ఉంటే రాజకీయాలకు గుడ్ బై చెప్పేవాడిని అంటూ చురకలు అంటించారు.

రైతు కూలీలకు ఇచ్చిన ఎన్నికల హామీ అమలుకు సిద్ధం అవుతుందన్నారు. వంద శాతం BRS బీజేపీలో విలీనం అవుతుంది…బీజేపీ కుర్చీ బచావో ప్రభుత్వమని చెప్పారు. నీతి అయోగ్ సమావేశాన్ని దక్షణాది రాష్ట్రాలు బహిష్కరిస్తాయి….. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై కేసీఆర్ ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version