టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఇవాళ నెదర్లాండ్ తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ 54 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అందులో 6 సిక్స్ లు ఉన్నాయి. అయితే ఒక క్యాలెండర్ ఇయర్ లో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ క్యాలెండర్ ఇయర్ లో హిట్ మ్యాన్ 59 సిక్సర్లు కొట్టాడు. ఇప్పటి వరకు ఒకే ఏడాదిలో ఇన్ని సిక్సర్లు ఏ ఆటగాడూ కూడా కొట్టలేదు. అతని తరువాత స్థానంలో ఏబీ డివిలియర్స్ (58) ఉన్నారు.
ప్రస్తుత ప్రపంచ కప్ లో మంచి ఫామ్ లో ఉన్న హిట్ మ్యాన్ 9 మ్యాచ్ ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీల సాయంతో 503 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. వరుస వరల్డ్ కప్ లలో 2019, 2023లలో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడు రోహిత్ శర్మనే. ఓ వరల్డ్ కప్ ఎడిషన్ లో అత్యధిక సిక్సర్లు 23 బాదిన కెప్టెన్ రోహిత్ శర్మనే కావడం విశేషం.