తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటి కొమురవెల్లి మల్లన్న ఆలయం. అయితే తాజాగా కొమురవెల్లి మల్లన్న ప్రసాదంలో పురుగులు రావడం భక్తులను విస్మయానికి గురి చేస్తుంది. అయితే ఇన్ని రోజులు తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యికి సంబంధించిన వార్తలు భక్తులు మారవా ముందే ఇప్పుడు ఈ కొమురవెల్లి ప్రసాదంలో పురుగులు రావడం భక్తులకు కోపాన్ని తెప్పిస్తుంది.
అయితే ఈ రోజు ఓ భక్తునికి ప్రసాదంలో పురుగు రావడంతో ఆశ్చర్య పోయి అక్కడి సిబ్బందిని ప్రశ్నించగా వారి సరైన సమాధానం ఇవ్వకపోగా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు అని అక్కడి వారు చెబుతున్నారు. అలాగే కొమురవెల్లి మల్లన్న ప్రసాదం అయిన లడ్డు, పులిహోరలో తయారీ లోపాలు ఉన్నాయి ఉంటున్నాయని పేర్కొంటున్నారు. ఇక ఇరుపతి లడ్డు ఘటన మరవక ముందే ఇప్పుడు ఇక్కడ ఇలా జరగడం భక్తుల భావాలను దెబ్బ తీస్తున్నాయి అంటున్నారు. కొమురవెల్లిలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి అని.. అయినా కూడా సిబ్బంది పట్టించుకోవడం లేదు అని భక్తులు తెలుపుతున్నారు.