నేవీ రాడార్ ఏర్పాటు వల్ల తెలంగాణ నష్టం లేదన్నారు మంత్రి కొండా సురేఖ. నేవీ రాడార్ ఏర్పాటు వల్ల దామగుండంలో అడవులు, గాలి, భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని కొందరు ఆరోపణలు చేస్తున్నారు….బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే నేవీ రాడార్ కోసం కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చిందన్నారు. చివరిగా సంతకం పెట్టాల్సి ఉండగా మాకు బైసన్ పోలో గ్రౌండ్ ఇవ్వాలని కేసీఆర్ ఆ ఫైల్ ను ఆపారని వెల్లడించారు.
ఇది కేంద్రానికి సంబంధించిన, దాని భద్రతకు సంబంధించిన అంశమని చెప్పారు. ఇప్పుడు అక్కడ చాలా చెట్లు నరికేశారు. గడ్డి ఉన్న చోటే నిర్మాణాలు జరుగుతున్నాయి….తమిళనాడులో 30 సంవత్సరాల నుంచి అక్కడ రాడార్ కేంద్రం నడుస్తోంది. అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని వివరించారు.
పరిగి కేంద్రీయ విద్యాలయాలు, న్యావీ స్కూల్స్ వస్తాయి….తెలంగాణ ప్రైడ్… ఈ ఫైల్ మా చేతుల నుంచి వెళ్ళింది కాదు.
అన్నీ బీఆర్ఎస్ పార్టీ నుంచే చేశారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు చాలా మోసం చేశారు. అన్యాయం చేసారు…పర్సెంజెట్ ల కోసం ఇతరులకు భూములు లీజ్ కు ఇచ్చారని ఆరోపణలు చేశారు. 44జీవో ఇచ్చి 2010 సెప్టెంబర్ లో తూర్పు నావికా దళం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది….ఉద్యమం వల్ల ఏమి కాదు. వాళ్ళు చేస్తోంది టైమ్ పాస్ కోసమే.. ప్రజలకు ఉపయోగపడే అంశాల్లో రాజకీయాలు వద్దని కోరారు.