బీజేపీ కార్యకర్త హత్య కేసులో కేరళలో సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో 15 మందికి బోర్డు కోర్టు ఉరిశిక్ష విధించింది. నిషేదిత పీఎఫ్ఐ, ఎస్డీఐపీకి చెందిన 15 మంది కార్యకర్తలకు న్యాయ స్థానం శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
రెండేళ్ల క్రితం బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో ఇప్పుడు నిషేధించబడిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)తో సంబంధం ఉన్న 15 మందిని కేరళ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ప్రాసిక్యూషన్ ప్రకారం.. డిసెంబరు 19, 2021న శ్రీనివాసన్ తన భార్య, తల్లి మరియు బిడ్డ ఎదుట తన అలప్పుజా ఇంటిలో కత్తితో దారుణంగా హత్య చేయబడ్డాడు.