తెలంగాణ కాంగ్రెస్ కలకలం చోటు చేసుకుంది. కొండా సురేఖ vs కడియం శ్రీహరి మధ్య పంచాయితీ నెలకొంది. ఎట్టకేలకు కొండా vs కడియం పంచాయితీలో పంతం కొండా ఫామిలీ నెగ్గించుకుంది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం శ్రీపతి పల్లి గ్రామంలో గుడి మొక్కులు చెల్లించారు కొండా మురళి. ఇన్నిరోజులు శ్రీపతిపల్లి గ్రామానికి రాకుండా అడ్డుకున్నారు కడియం శ్రీహరి. సర్పంచ్ అక్రమ అరెస్టు కడియం శ్రీహరి కుట్రే అని రుజువు అయింది అంటున్నారు నియోజకవర్గ ప్రజలు.

15 రోజుల కిందట…శ్రీపతిపల్లి గ్రామానికి మొక్కు చెల్లించుకోవాడనికి వస్తాను అని చెప్పిన మంత్రి కొండా సురేఖ దంపతులను రావొద్దు అని వారించారు కడియం శ్రీహరి. గ్రామ సర్పంచ్ తనతో పాటు పార్టీ మారలేదు అని కోపంతోనే ఇలా చేసారు అని అందరు చర్చించుకున్నారు. అయితే, తాజాగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం శ్రీపతి పల్లి గ్రామంలో గుడి మొక్కులు చెల్లించారు కొండా మురళి.