జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంపై నిఘా నేత్రం వేయనున్నారు పోలీస్ అధికారులు. కొండగట్టు ఆలయంలోని సిసి ఫుటేజ్ హైదరాబాద్లోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు పోలీసులు. కొండగట్టు పుణ్యక్షేత్రంతోపాటు ప్రధాన ప్రాంతాలు ఇక నుంచి పోలీసు నిఘా నేత్రంతో పర్యవేక్షణ ఉండనుంది.
ఈ మేరకు సిసి కెమెరాలను కొండపైన ఏర్పాటు చేశారు తెలంగాణ పోలీసులు. సిసి ఫుటేజ్ కొండగట్టు నుండి మల్యాల పోలీస్ స్టేషన్కు అక్కడి హైదరాబాద్ కంట్రోల్ రూమ్ కు కలెక్షన్ చేశారు. ఇక నుంచి కొండగట్టులో జరిగే ప్రతి సంఘటనపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. కాగా
కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి సర్వం సిద్ధం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 1:16 కు కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం కానుంది. 18 వ ఫ్లోర్ లో హైదరబాదు సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉండనుంది. జెండా ఆవిష్కరణ అనంతరం ముఖ్యమత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం కానుంది.