కామన్వెల్త్ గేమ్స్ ఆడను.. స్టార్ డిస్కర్ త్రోయర్ సంచలన వ్యాఖ్యలు

-

భారత స్టార్ డిస్కస్ త్రోయర్ సీమా పూనియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బర్మింగ్ హోమ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌ లో ఆమె ఎంతో నిరాశ మిగిల్చారు. 2006, 2014, 2018 సంవత్సరాల్లో జరిగిన గేమ్స్‌ లలో రజతం, 2010లో ఢిల్లీ గేమ్స్‌ లో కాంస్యం పతకాన్ని సీమా పూనియా గెలిచారు. తన కెరీర్‌లోనే మొట్టమొదటిసారిగా ఖాళీ చేతులతో స్వదేశానికి తిరిగి రానున్నారు. కామన్వెల్త్ గేమ్స్ లో పతక వేటలో వెనకడుగు వేశారు. దీంతో ఆమె కఠిన నిర్ణయం తీసుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్ లో ఆట ముగిసిన తర్వాత పూనియా మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీమా పూనియా

సీమా పూనియా (39 ఏళ్లు) కామన్వెల్త్ గేమ్స్‌ కు దూరమవుతున్నట్లు ప్రకటించారు. అయితే ఇది రిటైర్మెంట్ కాదని, కేవలం కామన్వెల్త్ గేమ్స్‌ కు దూరం అవుతున్నట్లు వెల్లడించారు. కామన్వెల్త్‌ లో రాణించలేకపోవడానికి తనకు బాధగా లేదన్నారు. తనపై తనకు నమ్మకం ఉందని, తను స్ట్రాంగ్‌గా ఉన్నందుకే ఇక్కడి వరకు వచ్చానన్నారు. గతేడాది నడుము నొప్పి కారణంగా ట్రైనింగ్‌కు దూరమయ్యానని, సెప్టెంబర్‌లోనే ట్రైనింగ్ ప్రారంభించానని ఆమె తెలిపారు. రానున్న ఆసియా, ప్యారిస్ ఒలింపిక్స్ గేమ్స్‌ లో అత్యుత్తమ ప్రదర్శక కనబర్చి.. మెడల్స్ సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version