BSP పొత్తు ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌కు కోనేరు కోనప్ప రాజీనామా

-

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీల మధ్య పొత్తు కుదిరింది. ఎంపీ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేయాలని గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. మరోవైపు బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే, బీఆర్ఎస్ తో బీఎస్పీ ప్రవీణ్ కుమారు పొత్తు పెట్టుకోవడంతో బీఆర్ఎస్ కు కోనేరు కోనప్ప గుడ్ బై చెప్పారు.

Koneru Konappa resigns from BRS

ఈ మేరకు రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపారు. గత ఎన్నికల్లో సిర్పూర్ నుంచి కోనప్ప పై ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. కులాల పేరుతో ప్రవీణ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో దూషించాడని.. నన్ను వ్యక్తిగతంగా దూషించిన ప్రవీణ్ కుమార్ తో బిఆర్ ఎస్ పొత్తు పెట్టుకుంటారా ? అంటూ బీఆర్ఎస్ కు కోనేరు కోనప్ప గుడ్ బై చెప్పారు. నన్ను కేసీఆర్ అవమాని0చాడు అంటూ ఫైర్ అయ్యారు. ఇక నేడు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట కోనేరు కోనప్ప.

Read more RELATED
Recommended to you

Latest news