సిర్పూర్ కాంగ్రెస్ పార్టీలో కల్లోకలం నెలకొంది. కాంగ్రెస్ పార్టీతో తాడోపేడో తేల్చుకుంటా అంటూ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/Koneru-Konappa.jpg)
వీర్ దండి గుండాయిపేట మధ్య బ్రిడ్జిని నేను మంజూరు చేయించి నిధులు సైతం మంజూరు చేయించా …కానీ రద్దు చేయించారని ఆగ్రహించారు. ప్రత్యక్షంగా బిజేపి పరోక్షంగా కాంగ్రెస్ నేతల పై కోనప్ప ఆరోపణలు చేశారు. అందరి ఆశీర్వాదంతో ఒంటరిగా బరిలో దిగుతానన్నారు. ఎన్నికలు వస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ ప్రకటించారు. ఎవ్వరు వస్తే వారిని బ్రిడ్జి నిర్మాణం కోసం నిలదీయండని కోరారు. నేను మంజూరు చేయించిన బ్రిడ్జిని రద్దు చేస్తారా…అంటూ నిలదీశారు. మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లబోనన్నారు. నేను ఏ పార్టీలో చేరినా… ఊరూరు తిరిగి ప్రజల ముందే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.