కాంగ్రెస్, బీజేపీ దొంగలే మేడిగడ్డ దగ్గర బాంబు పెట్టి పేల్చేశారు – కేటీఆర్

-

కాళేశ్వరం ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది… ఈ కాంగ్రెస్, బీజేపీ దొంగలే మేడిగడ్డ దగ్గర బాంబు పెట్టి పేల్చేశారని నా అనుమానం అని బాంబు పేల్చారు కేటీఆర్. ఇవాళ మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. అందాల పోటీలు రేవంత్ రెడ్డికి, భట్టి విక్రమార్కకు మధ్య జరుగుతున్నట్టు ఉన్నాయని చురకలు అంటించారు.

KTR
ktr

మిస్ వరల్డ్ బ్యానర్ల మీద రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు ఫొటోలు చూసాను, వారిలో ఎవరు మిస్ వరల్డ్ పోటీదారులో అర్థం కాలేదు అని సెటైర్లు పేల్చారు కేటీఆర్. వడ్లు కోనేటోడు లేడు, కొన్న వడ్లు తరిలించేటోడు లేడు అడుగుదాం అంటే స్థానిక నాయకులు అసలు పత్తాకే లేరు అంటూ చురకలు అంటించారు కేటీఆర్. మా ప్రభుత్వంలో ఫైల్‌లు కదలాలి అంటే మంత్రుల చెయ్యి తడపాల్సిందేనని కొండా సురేఖ చెప్పిందఐ గుర్తు చేశారు. మా ప్రభుత్వంలో మంత్రులు 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారు ఇంకొక కాంగ్రెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెప్పాడని తెలిపారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news