లగచర్ల లో జరిగిన ఘటనలో పూర్తిగా ఇంటలిజెన్స్, పోలీసుల వైఫల్యం ఉంది అని బ్రష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అభిప్రాయ సేకరణ జరుగుతున్న సమయంలో పోలీసులు ఎందుకు అక్కడ లేరు. పట్నం నరేందర్ రెడ్డి ఏదో నా పేరు చెప్పాడని రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. కానీ అదంతా బాక్వాస్ అని పట్నం నరేందర్ రెడ్డి లేఖ రాశారు. రైతులపై దాడికి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ కు వెళ్లినట్లు వెళ్లారు. పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తూ రైతులను ఇష్టమొచ్చినట్లు కొట్టారు.
ఒక అమ్మాయి ఛాతి మీద కాలు పెట్టి ఆమె భర్తను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ విషయాన్ని ఆ అమ్మాయి మీడియాతో చెబుతూ ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది. నా మీద కేసు పెడితే నేను ఊరుకుంటా అనుకుంటే రేవంత్ రెడ్డి అంత పిచ్చోడు మరొకరు ఉండరు. జైలు నుంచి వచ్చాక కూడా పోరాటం చేస్తా. రైతులను పోలీసులు తీవ్రంగా కొట్టారు. వారికి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేయించలేదు. ఈ విషయాన్ని ఇంతటితో నేను వదిలిపెట్టను. ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల, మహిళా కమిషన్ వరకు ఈ విషయాన్ని తీసుకెళ్తా అని KTR పేర్కొన్నారు.