వచ్చే నెలలో అమెరికాకు మోదీ.. 16వేల మంది ప్రవాస భారతీయులతో భేటీ!

-

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికాలో పర్యటించనున్న ఆయన అక్కడి ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు. సెప్టెంబర్​లో 22వ తేదీన లాంగ్‌ ఐలాండ్‌లోని నసావు కొలీజియంలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 16వేల సీటింగ్ కలిగిన ఆ కొలిజీయంలో జరిగే కార్యక్రమానికి భారీగా ప్రవాస భారతీయులు హాజరయ్యే అవకాశం ఉంది.

2014లో భారత ప్రధాని పదవి తొలిసారి చేపట్టిన తర్వాత న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. 2019లో హ్యూస్టన్‌లోని ఎన్​ఆర్​జీ స్టేడియంలో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని. ఇక 2021 సెప్టెంబర్​లో వార్షిక అత్యున్నత స్థాయి యూఎన్​జీఏ సమావేశంలో పాల్గొని స్పీచ్ ఇచ్చారు. గతేడాది జూన్ 21వ తేదీన యూఎన్ ప్రధాన కార్యాలయంలో యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. మరోవైపు వచ్చే నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఐరాస జనరల్‌ అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా, 26న ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version