తెలంగాణ భవన్ లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి BRSలో భారీ చేరికలు జరిగాయి. ఇటీవల కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్ లోకి వెళ్లి మళ్ళీ BRSలోకి వచ్చారు నేతలు. అయితే ఈ జాయినింగ్స్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. తొందర్లోనే స్టేషన్ ఘనపూర్ లో ఉప ఎన్నిక రాబోతుంది. స్టేషన్ ఘనపూర్ లో BRS తరుపున రాజయ్య భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. కేసీఆర్ కూడా పార్లమెంట్ ఎన్నికల సమయంలో చెప్పారు. హై కోర్ట్ లో కేస్ తీర్పు రిజర్వ్ లో ఉంది. ఈ తీర్పు మనకు అనుకూలంగా వస్తుంది అని ఆశిస్తున్నాము.
పార్టీ మారిన ఎమ్మెల్యే లపై వేటు పడడం ఖాయం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ తో ఓడిపోయాం. ఈసారి మనమే అధికారంలోకి రాబోతున్నాం. రాష్ట్రం అంతా మోసపోయినా ఘనపూర్ ప్రజలు మాత్రం మోసపోలేదు. కానీ ఎన్నికల తర్వాత మాతో పాటు ఘనపూర్ ప్రజలు కూడా మోసపోయారు. కేవలం 1.5 శాతం అంటే నాలుగు లక్షల ఓట్ల తేడా తో మనం ఓడిపోయాము అని కేటీఆర్ తెలిపారు.