నేను డాక్టర్ కావాలని మా అమ్మ కోరుకుందని మంత్రి KTR ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ లో ‘ఉమెన్ ఇన్ మెడికల్ కాంక్లేవ్’ ప్రారంభం కాగా ముఖ్య అతిధిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, కోవిడ్ సమయంలో అందరికీ ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి ఆ సమయంలో ఏ ఐ జి మంచి సేవలు అందించిందని చెప్పారు.
కోవిడ్ సమయంలో అందరికి అందుబాటులో ఉన్న ధరలతో సేవలు అందించారు…కమర్షియల్ , ప్రాఫిట్ కోసం కాకుండా రీసెర్చ్ కోసం అందరికి అందుబాటులో వైద్యం ఉండాలని ఏ ఐ జి ప్రారంభించారని తెలిపారు. అందరు ప్రతి ఇంట్లో వారి పిల్లల్లో ఒకరైన డాక్టర్ కావాలని కోరుకుంటారు…నేను డాక్టర్ కావాలని మా అమ్మ కోరుకుందని వెల్లడించారు. వైద్యవృత్తి ఎంతో ఉన్నతమైనది…గత కొన్ని ఏండ్ల నుండి ఇండియా మెడికల్ ఫీల్డ్ లో ఎంతో పురోగతి సాధిస్తుంది…వైద్యులు తమ డ్యూటికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు…వైద్య వృత్తిలో మహిళలు రాణిస్తున్నారని పేర్కొన్నారు.