ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తుషార్ కు సిట్ మరోసారి నోటీసులు

-

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. నేడు కేరళకు వెళ్లిన సీట్ అధికారులు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు, కేరళ బీడీజేఎస్ అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లికి, జగ్గు స్వామి లకు మరోసారి నోటీసులు అందజేశారు. మూడు రోజుల క్రితం సీట్ విచారణకు సహకరించాలని తెలంగాణ హైకోర్టు తుషార్ కు సూచించింది. ఈ నేపథ్యంలో కేరళ వెళ్ళిన సిట్ అధికారులు.. విచారణకు హాజరు కావాలంటూ రెండవసారి తుషార్ కి నోటీసులు అందజేశారు.

మరోవైపు కొచ్చిలోని జగ్గు స్వామికి కూడా నోటీసులు అందజేశారు. ఇదిలా ఉంటే ఇటీవల ఈ కేసులో పోలీసులు మరో ఇద్దరిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో అరెస్టు అయి విచారణ ఎదుర్కొంటున్న నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు వీరిద్దరిని ఫరీదాబాద్ ప్రాంతంలో అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version