బాలకృష్ణ – శృతిహాసన్ జంటగా క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘వీర సింహ రెడ్డి’ . మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు.
2023 సంక్రాంతి సీజన్‌లో విడుదల కానున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ మెయిన్ విలన్‌గా నటిస్తోంది. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా జనవరి 12 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది.
This Sankranthi gets MASSive with the arrival of the GOD OF MASSES ❤️🔥#VeeraSimhaReddy Grand Worldwide Release on 12th January, 2023 🔥#NandamuriBalakrishna @megopichand @shrutihaasan @OfficialViji @varusarath5 @MusicThaman @SonyMusicSouth pic.twitter.com/4BCS7twjz6
— Mythri Movie Makers (@MythriOfficial) December 3, 2022