ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేను మెచ్చుకున్న కేటీఆర్

-

పొద్దున లేస్తే చాలు కాంగ్రెస్ పార్టీని అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బండ బూతులు తిట్టే గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేను తాజాగా మెచ్చుకున్నారు కేటీఆర్. నిజాలు మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని నేను అభినందిస్తున్నాను అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల అనిరుద్ రెడ్డి… కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వకండి అని.. వాళ్ళ ఇంట్లో నల్ల తోపాటు కరెంటు కూడా బంద్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ కేటీఆర్ మెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు కోవర్ట్ రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్నాడని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలన కాదు కోవర్ట్ పాలన అంటూ మండిపడ్డారు కేటీఆర్. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతుబంధును అస్సలు వేయబోరని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై ఆరోపణలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news