రైతు రుణమాఫీపై కేటీఆర్ కౌంటర్…రైతు బంధు డబ్బులు ఎక్కడా ?

-

రైతు రుణమాఫీపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రుణమాఫీ పేరిట మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్! రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే రు. 7000 కోట్లు రుణమాఫీకి దారి మళ్లించిందని నిప్పులు చెరిగారు. హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుండి కొంతమొత్తం విదిల్చి, రుణమాఫీ చేస్తున్నమని పోజులు కొడుతుందని చురకలు అంటించారు.

ktr counter on runamafi scheme

40 లక్షల పైచిలుకు రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తరు? అని నిలదీశారు. 2014, 2018లో కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులకే అర్హతనా? అని నిలదీశారు.

2014 లోనే కేసీఆర్ సర్కార్ లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి రూ. 16,144 కోట్లు వెచ్చించి సుమారు 35 లక్షల రైతులకు లబ్ది చేకూర్చిందని వెల్లడించారు. 2018లో అదే లక్షలోపు రుణమాఫీకి రూ. 19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్దిదారుల సంఖ్య సుమారు 37 లక్షలు అన్నారు. కాంగ్రెస్ మానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు రూ. 2 లక్షల వరకూ ఉన్న పంటరుణాలు అన్నీ వెంటనే మాఫీ చేయాలని… అర్హులైన అందరు రైతులకూ రైతుబంధు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version