ఇవాళ మంచిర్యాలలో మంత్రి కేటీఆర్ రోడ్ షో

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ ప్రజలను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మూడోసారి అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో గులాబీ నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన కేటీఆర్.. తాజాగా రోడ్ షోలు ప్రారంభించారు. ముఖ్యంగా హైదరాబాద్​లో మెజార్టీ సాధించడమే లక్ష్యంగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తూ కాంగ్రెస్​, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. వారు పాలించిన సమయంలో తెలంగాణకు చేసిన అభివృద్ధి శూన్యమంటూ నొక్కివక్కాణించి మరీ చెబుతున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మంత్రి కేటీఆర్ మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మంచిర్యాల, జన్నారంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అక్కడ నిర్వహించే రోడ్ షోలలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​పై మరోసారి కేటీఆర్ విరుచుకుపడనున్నారు. ఇప్పటికే హస్తం పార్టీపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్న కేటీఆర్ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఊదరగొడుతున్న ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆరుగురు సీఎంలు మారడం మాత్రం గ్యారెంటీ అని ప్రజలకు వివరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version