సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న నేతన్న కుటుంబానికి కేటీఆర్ ఆర్థిక సాయం

-

సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న నేతన్న దంపతుల కుటుంబాన్ని పరామర్శిచారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు భరించలేక సిరిసిల్ల పట్టణంలోని 37వ వార్డు, వెంకంపేటకు చెందిన నేతన్న దంపతులు బైరి అమర్ (అమర్ – స్రవంతి) దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

 

KTR financial assistance to the family of the leader who committed suicide in Sirisilla

ఈ తరుణంలోనే బైరి అమర్ – స్రవంతి దంపతుల ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు చదువుకున్నంత వరకు తన పిల్లల మాదిరి చదివిపిస్తానని హామి ఇచ్చారు కేటీఆర్.. రెండు లక్షల రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు.

పూర్తిగా అండగా ఉంటానని మాట ఇచ్చిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండీ 20 మంది నేత కార్మికులు చనిపోయారని ఆగ్రహించారు. సిగ్గు, లజ్జ ఉంటే నేత కార్మికులకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. సిరిసిల్లలో నేను ఎమ్మెల్యేగా ఉండటం నీకు నచ్చకుంటే నేను ఉండటం వల్ల ఇక్కడ ఇబ్బందులు వస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version