ఇది కుంభకర్ణ ప్రభుత్వం : కేటీఆర్

-

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యర్థం చేసారు. హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం 27 ఆగస్టు నాడు పలు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నదని, కనుక ప్రభుత్వం అలెర్ట్‌గా ఉండాలని తెలియజేసింది. కానీ, రాష్ట్రంలోని కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదు. ఎలాంటి ముందుజాగ్రత్తలు లేవు. స్థానిక ప్రజలకు హెచ్చరికలూ లేవు.

రేవంత్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యం ఖరీదు – ఒక యువ శాస్త్రవేత్తతో పాటు సుమారు ఇరవై మంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఒక మంత్రి హెలికాప్టర్లు దొరకలేదంటాడు. మరొక మంత్రి, ఈ రాష్ట్రానికి సీఎం లేనట్టు పక్క రాష్ట్రపు సీఎంకు ఫోన్ చేస్తాడు. మూడో మంత్రి ఫోటోలకు పోజులకే పరిమితమవుతాడు అని కేటీఆర్ అన్నారు. అలాగే జరగాల్సిన నష్టమంతా జరిగాక పూల డెకరేషన్ స్టేజీ మీద కూర్చొని వరదల మీద సమీక్ష చేసే చీప్ మినిస్టర్.. వరదలొస్తే సాయం చేయకుండా ప్రతిపక్షం ఏం చేస్తుందని ప్రశ్నిస్తాడు అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version