రాహుల్, రేవంత్.. గురించి గాంధీజీ ఆనాడే ఊహించి కాంగ్రెస్ అవసరం లేదన్నారేమో : కేటీఆర్‌

-

తెలంగాణలో రాహుల్ గాంధీ మూడ్రోజులుగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విజయభేరి బస్సు యాత్రలో పాల్గొంటూ ప్రజలను కలుస్తున్నారు. వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. రాహుల్ ప్రసంగాలపై బీఆర్ఎస్ మంత్రులు మండిపడుతున్నారు. కనీసం తెలుసుకుని మాట్లాడితే బాగుండేదని ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణ ద్రోహులకు తెలంగాణకు వచ్చే అర్హత లేదంటూ ఫైర్ అవుతున్నారు.

తాజాగా కాంగ్రెస్ పార్టీపై.. ఆ పార్టీ అవినీతిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. అవినీతి గురించి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. టికెట్లు అమ్ముకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ నేతలే ఈడీకి ఫిర్యాదు చేశారని.. ఓటుకు నోటు కేసులో ఆయన ఇప్పటికే పట్టుబడ్డాడని కేటీఆర్ ట్వీట్​లో పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్‌ అవసరం లేదని గాంధీజీ అన్నారని.. రాహుల్, రేవంత్ లాంటివారు కాంగ్రెస్‌లో ఉంటారని ఆయన ఆనాడే ఊహించారేమో? అని అన్నారు. పీసీసీ పోస్టును రూ.50 కోట్లకు అమ్మారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారని… ఒకరు పీసీసీ పోస్టును విక్రయిస్తే మరొకరు కొనుగోలు చేశారని.. ఇంత అవినీతి పార్టీలో ఉన్న రాహుల్‌.. అక్రమాలపై మాట్లాడటం హాస్యాస్పదం అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news