బీఆర్ఎస్ పార్టీలో చేరారు అంబర్పేట శంకర్. మంత్రి హరీశ్ రావు సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు అంబర్పేట శంకర్. ఇక అటు మంత్రి హరీశ్ రావు సమక్షంలో గులాబీ పార్టీలో ఉప్పల్ సర్కిల్ మాజీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముశనం శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎ కల్పనారెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు చేరారు. ఇది ఇలా ఉండగా.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కీలక నేతలు పార్టీలు మారుతున్నారు.
భారత రాష్ట్ర సమితి పార్టీలో టికెట్లు రాని నేతలు కాంగ్రెస్లో చేరితే… కాంగ్రెస్ పార్టీలో టికెట్లు రానివారు గులాబీ గూటికి వస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ చాలా మంది కాంగ్రెస్ నేతలు గులాబీ గూటికి చేరుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. నల్లగొండ కాంగ్రెస్ పార్టీకి చెందిన చెందిన బీసీ నాయకుడు, ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ సైతం బీఆర్ఎస్ పార్టీలో చెరబోతున్నట్లు సమాచారం. రెండు రోజుల్లో ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ సైతం బీఆర్ఎస్ పార్టీలో చెరబోతున్నట్లు సమాచారం.