గ్రీన్ కో ఇచ్చిన బాండ్లపై కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఫార్ములా- ఈ రేస్ నిర్వహించిన గ్రీన్ కో కంపెనీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి రూ.కోట్ల రూపాయల లబ్ధి చేకూరినట్లు కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ.49 కోట్లు చెల్లించిన గ్రీన్ కో అంటూ వార్తలు ప్రచురణ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్ కో మరియు దాని అనుబంధ సంస్థలు ఏకంగా 41 సార్లు ఎన్నికల బాండ్ల రూపంలో ముడుపులు అందించినట్లు ప్రచారం జరుగుతోంది.
రేస్ కు సంబంధించిన చర్చలు మొదలు అయినప్పటి నుంచే బాండ్లను కొనుగోలు చేసిందట గ్రీన్ కో సంస్థ. అయితే… రేవంత్ ప్రభుత్వం కావాలని లీక్ చేసిన ఫార్మూలా కేసులో అంశాలపై చిట్ చాట్ లో స్పందించారు కేటీఆర్. గ్రీన్ కో ఇచ్చిన బాండ్లు 2022లో… ఫార్మూలా రేసు జరిగింది 2023లో అని వెల్లడించారు. ఫార్మూలా రేసు వల్ల గ్రీన్ కో లబ్ధి చేకూరలేదు సరికదా గ్రీన్ కో నష్టపోయిందన్నారు. ఎన్నికల బాండ్ల విధానం తెచ్చింది కేంద్రం… అన్ని పార్టీలకు వచ్చినట్లే బీఆర్ఎస్ కు వచ్చాయని వివరించారు. చర్చకు వారు రెడీ అయితే మేం కూడా రెడీ అంటూ చిట్ చాట్ లో కేటీఆర్ తెలిపారు.
ప్రభుత్వం కావాలని లీక్ చేసిన ఫార్మూలా కేసులో అంశాలపై చిట్ చాట్ లో స్పందించిన కేటీఆర్
గ్రీన్ కో ఇచ్చిన బాండ్లు 2022లో…
ఫార్మూలా రేసు జరిగింది 2023లో…
ఫార్మూలా రేసు వల్ల గ్రీన్ కో లబ్ధి చేకూరలేదు సరికదా గ్రీన్ కో నష్టపోయింది
ఎన్నికల బాండ్ల విధానం తెచ్చింది… pic.twitter.com/ujeDALzMzS
— Pulse News (@PulseNewsTelugu) January 6, 2025