ప్రజల తరపున మాట్లాడిన వారిపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమ కేసుల పెడతోందని, ఎలాంటి కేసులు పెట్టినా వెనక్కి తగ్గబోమని ప్రజల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ముందుగా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి కవిత నివాళులర్పించి మాట్లాడుతూ. ఏసీబీ కేసులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నపై రేవంత్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలతో పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు.
రైతు భరోసా కింద రూ. 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి తాజాగా రూ. 12 వేలకు తగ్గించారని, సీఎం రేవంత్ మోసపూరిత హామీలు ఇచ్చి రైతులను మోసం చేశారన్నారు అందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారని తెలిపారు బీఆర్ఎస్ ధర్నాలకు భయపడిన ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తుందని ఆరోపించారు. మోసపూరిత నిరంకుశ కాంగ్రెస్ సర్కారుకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.