ముగిసిన కేటీఆర్ విచారణ.. ఈడి ఆఫీస్ వద్ద హైడ్రామా

-

ఫార్ములా – ఈ కార్ రేసు వ్యవహారంలో నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు కేటీఆర్ ని ఈడీ కార్యాలయంలో దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఉదయం 10:30 గంటలకు ఈడీ కార్యాలయంలోకి చేరుకున్న కేటీఆర్ ని విచారణ బృందం సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఆర్బిఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు పై ఈడి మరో కేసుని నమోదు చేసింది.

అయితే విచారణలో కేటీఆర్ ని ప్రధానంగా నగదు బదిలీ చుట్టూ ప్రశ్నలు సంధించారని, హెచ్ఎండిఏ ఖాతా నుంచి విదేశీ కంపెనీకి నిధుల బదలాయింపు, నిధుల బదలాయింపులో ఫెమా నిబంధనల ఉల్లంఘన పై ఈడీ కేటీఆర్ ని సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు సమాచారం. ఏడు గంటల విచారణ అనంతరం కేటీఆర్ విచారణ ముగిసిందని బిఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సహ కార్యకర్తలు ఈడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.

దీంతో వారిని అక్కడి నుండి వెళ్ళిపోవాలని పోలీసులు సూచించారు. కానీ బిఆర్ఎస్ నేతలు, పలువురు కార్యకర్తలు అక్కడే ఉంటామని తేల్చి చెప్పడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అలాగే ఈడీ ఆఫీసు వైపు వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్లిస్తున్నారు. దీంతో కేటీఆర్ ఈడీ ఆఫీసు నుంచి బయటకు వస్తారా..? లేదా..? అన్న ఉత్కంఠ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news