ఆ 400 ఎకరాల భూమి ఎవరు కొనుకున్నా తిరిగి వెనక్కి తీసుకుంటాం – KTR

-

HCU వివాదంపై కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. మూడేళ్లలో అధికారంలోకి రాగానే ఆ 400 ఎకరాల భూమిని అతిపెద్ద ఈకో పార్క్ లాగా మారుస్తామని వెల్లడించారు. ఆ 400 ఎకరాల భూమిలో ఎవరు ఇంచు కొనుకున్నా తిరిగి వెనక్కి తీసుకుంటామని పేర్కొన్నారు కేటీఆర్.

ktr

ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అన్నారు. ప్రజల భూమికి నువ్వు కేవలం ధర్మకర్తవు మాత్రమే.. దాన్ని కాపాడాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే కుదరదు అని చెప్పారు కేటీఆర్. పచ్చని చెట్లను నరకొద్దని విద్యార్థులు నిరసనలు చేస్తుంటే, మంత్రులు వాళ్లకు దైర్యం ఇవ్వాల్సింది పోయి వాళ్ళని గుంట నక్కలు, పెయిడ్ ఆర్టిస్టులు అని అవమానపరుస్తున్నారన్నారు కేటీఆర్.  రేవంత్ రెడ్డి 10 నిమిషాలైన మనిషిలా పని చెయ్.. 18 గంటలు రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగ కాదని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news