తెలంగాణను ముంచిన పులకేశి… ఢిల్లీ వీధుల్లో కొత్త నాటకం – KTR

-

ఢిల్లీలో రేవంత్‌ రెడ్డి ఎన్నికల పర్యటనపై KTR సెటైర్లు పేల్చారు. తల్లికి బువ్వ పెట్టనోడు-చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు ఉందని… తెలంగాణలో 420 హామీలు ఇచ్చి గంగలో కలిపి- ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం మొదలు పెట్టిండని చురకలు అంటించారు కేటీఆర్‌. తెలంగాణలో సాగుతున్న నికృష్ట పాలన – ఢిల్లీలో కూడా చేయిస్తానని బయలుదేరిన పులకేశి… ఉచిత కరెంటు ఇచ్చింది ఎవరికి ? -గ్యాస్ సబ్సిడీ ఇచ్చింది ఎవరికి ? అంటూ నిలదీశారు.

KTR revanth over rythu bharosa

నెలకు రూ.2500 ఇస్తున్న మహిళలు ఎవరు ? – తులంబంగారం ఇచ్చిన ఆడబిడ్డలు ఎవరు ? రైతుభరోసా రూ.7500 ఇచ్చిందెక్కడ ? – ఆసరా ఫించన్లు రూ.4000 చేసిందెక్కడ ? అంటూ నిలదీశారు కేటీఆర్‌. రూ.5 లక్షల విద్యాభరోసా ఎక్కడ ? – విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఎక్కడ ? పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్టు ఇక్కడ హామీలకు దిక్కులేదు గాని అక్కడ ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నావా అని నిలదీశారు. ఈడ ఇచ్చిన హామీలకు దిక్కు లేదు .. ఢిల్లీలో ఇస్తున్న హామీలకు గ్యారంటీ ఇస్తున్నావా ? ఢిల్లీ గల్లీల్లో కాదు దమ్ముంటే మీ ఢిల్లీ గులాం తో అశోక్ నగర్ గల్లీల్లో చెప్పు ఉద్యోగాలు ఇచ్చామని… నవ్విపోదురు గాక .. నాకేంటి సిగ్గు అన్నట్లుంది రేవంత్ వ్యవహారం అంటూ ఎద్దేవా చేశారు. జాగో ఢిల్లీ జాగో అన్నారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version