ఈ రోజు చేవెళ్లలో BRS రైతు దీక్ష ఉంది. ఈ రోజు చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ లో BRS రైతు దీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి 15 వేల రూపాయల రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి BRS రైతు దీక్ష ప్రారంభం కానుంది.
అయితే… ఈ రైతు దీక్షకు కేటీఆర్, BRS ఎంఎల్ఏ లు, మాజీ మంత్రులు హాజరుకానున్నారు. ఇక చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ లో BRS రైతు దీక్ష ను సబితా ఇంద్రారెడ్డి.. ఆమె కొడుకులు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా.. నిన్న ఈడీ విచారణను ఎదుర్కొన్న కేటీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కోసం ప్రజాధనం రూ. 10 కోట్లు వృధా చేస్తున్నారని రేవంత్ పై ఫైర్ అయ్యారు.
అర్హులైన రైతులందరికి రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. రేపు (జనవరి 17, 2025) ర్యాలీకి పిలుపునిచ్చిన రుణమాఫీ సాధన పోరాట రైతు జేఏసీ.
ర్యాలీలో పాల్గొననున్న కల్వకుర్తి, వెల్దండ, వంగూర్, చారకొండ, ఊర్కొండ మండలాల రైతులు.
రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లె వంగూర్ మండలానికే… pic.twitter.com/zjvbu33jVW
— Mission Telangana (@MissionTG) January 16, 2025