అమెరికాలో ఖమ్మం విద్యార్థిపై దాడి.. ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ

-

అమెరికాలో తెలంగాణ విద్యార్థి కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అక్కడే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. విద్యార్థికి, వారి కుటుంబానికి సాయం చేస్తానని హామీ ఇచ్చారు. అసలేం జరిగిందంటే..

ఖమ్మం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన వరుణ్‌రాజ్‌(24) యూఎస్ లోని ఇండియానా రాష్ట్రంలో ఎంఎస్ చేస్తున్నారు. ల్సరేసో నగరంలో ఆదివారం రోజున వరుణ్.. జిమ్ నుంచి బయటకు వస్తుండగా.. జోర్డాన్ ఆండ్రాడే అనే వ్యక్తి వరుణ్ తలపై కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో వరుణ్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు. జోర్డాన్ ను అరెస్టు చేశారు. ప్రస్తుతం వరుణ్ అక్కడే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అయితే ఈ ఘటన వివరాలను డాక్టర్ మానస కాపూరి సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. తన కుమారుడిని చూడాలంటూ వరుణ్ తల్లిదండ్రులు ఆరాట పడుతున్నారని.. వరుణ్ పై దాడి జరిగిన విషయం తెలుసుకుని కన్నీరుమున్నీరు అవుతున్నారని చెప్పారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. అవసరమైన సహకారాన్ని అందిస్తామని, భారత రాయబార కార్యాలయంతో మాట్లాడి ఏర్పాట్లు చేయిస్తానని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news