పుట్టుక మీది.. చావు మీది.. బ్రతుకంతా తెలంగాణది : కేటీఆర్

-

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా కేటీఆర్ ట్వీట్ ఆయణ్ను స్మరించుకున్నారు. పుట్టుక మీది.. చావు మీది.. బతుకంతా తెలంగాణది అంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని ధారబోసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా మా ఘన నివాళులంటూ అంజలి ఘటించారు. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి ఆయన చేసిన కృషి అనిర్వచనీయం అని కొనియాడారు. స్వరాష్ట్ర సాధనలో ఒక దిక్సూచిగా నిలిచిన ఆయన కీర్తి అజరామరమైనదని అన్నారు. ఆయన స్ఫూర్తి మరిచిపోలేనిదన్న కేటీఆర్.. ఆయన అడుగుజాడల్లోనే తెలంగాణ రాష్ట్ర పోరాటం.. తెలంగాణ ప్రగతి ప్రస్థానం సాగుతోందని తెలిపారు.

మరోవైపు ప్రత్యేక రాష్ట్ర సాధ‌నే ఉచ్ఛ్వాస‌ నిచ్ఛ్వాసలుగా జీవిత ప‌ర్యంతం గ‌డిపిన ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ స‌ర్‌ను తెలంగాణ స‌మాజం స‌దా గుర్తుంచుకుంటుంద‌ని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. జ‌య‌శంక‌ర్ ఉద్యమ స్ఫూర్తిని కొన‌సాగిస్తామ‌ని ఆయ‌న ఆశ‌య సాధ‌న‌కు కోసం ప్రభుత్వం పూర్తిగా క‌ట్టుబ‌డి ఉంటుంద‌ని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version