KTR: కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తప్పుడు అరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డి లకు లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కు నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
ఎవరినో హీరోయిన్లను బెదిరించాను అనే ఓ మంత్రి మాట్లాడుతున్నారు..ట్యాపింగ్ వ్యవహారానికి నాకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ వివరణ ఇచ్చారు. లేదు ఇలాగే ఆరోపణలు చేస్తే ఎవరిని వదిలిపెట్టము. తాట తీస్తామని హెచ్చరించారు.
ఖైరతాబాద్, ఘనపూర్ లలో ఉప ఎన్నికలు వస్తాయన్నారు. ఈ ఆదివారం లోపు స్పీకర్ తేల్చకుంటే.. కోర్టు కు పోతాము… సుప్రీంకోర్టు తీర్పు కూడా అనర్హత వేయలని ఉందని గుర్తు చేశారు కేటీఆర్. కాంగ్రెస్ కు హైదరాబాద్ ఓటు వేయదు, అది అందరికీ తెలుసు, అందుకే హైదరాబాద్ లో ప్రజలపై కక్ష కట్టావా అంటూ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.