లారీ డ్రైవర్ ను దారుణంగా కొట్టాడు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ దగ్గర లారీ డ్రైవర్ పైన చేయి చేసుకోవడంతో పాటు అసభ్య పదజాలంతో తల్లీ, పెళ్ళాం అంటూ దారుణంగా దూషించాడు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్. అయితే.. ఈ సంఘటనపై కేటీఆర్ సీరియస్ అయ్యారు.
పోలీసుల వ్యవహార శైలిపైన డీజీపీని మరోసారి ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్….. వినరాని భాషలో పోలీస్ సిబ్బంది సాధారణ పౌరుడిని దుర్భాషలాడడంపై అభ్యంతరం తెలిపారు. ఇది పోలీస్ శాఖకు, డీజీపీకి అంగీకారయోగ్యమైన భాషనా అని ప్రశ్నించారు. పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు ప్రజలే జీతాలు చెల్లిస్తున్నారని గుర్తుంచుకోవాలన్న కేటీఆర్….ఈ మధ్యకాలంలో పోలీసులు ప్రజలతో ప్రవర్తిస్తున్న తీరు అనేకసార్లు తమ దృష్టికి వచ్చిందని వివరించారు. పదుల సంఖ్యలో సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వస్తున్న పోలీసులు చర్యలు తీసు కోవడం లేదని నిప్పులు చెరిగారు.
https://youtube.com/shorts/gSdssRjDjgU?si=uFyIzOYvG0egADpE