రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? : కేటీఆర్

-

తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి మండిపడ్డారు. ఎక్స్ వేదికగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అని ప్రశ్నించిన కేటీఆర్ విత్తనాల కోసం రైతులకు ఏంటీ వెతలని నిలదీశారు. పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ ? ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది ? అని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా? నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు..! నేడు.. విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు. పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి ? సాగునీళ్లు ఇవ్వడం చేతకాక పంటలు ఎండగొట్టారు. ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా ? తెల్లవారుజామున 4 గంటలకు లైన్ లో నిలబడితే సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు ఇవ్వలేరా? గత పదేళ్లపాటు 10 నిమిషాల్లో అందిన విత్తనాలు ఇప్పుడు 10 గంటలపాటు పడిగాపులు పడినా అందించలేరా ? అని కేటీఆర్ నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version