సుప్రీంకోర్టుకు కేటీఆర్ వెళ్లనున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టుకు కేటీఆర్ వెళుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్సీల పైన న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు కేటీఆర్. ఇందులో భాగంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు తన లీగల్ సెల్ బృందంతో కలిసి శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు కేటీఆర్.

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో మూడు నెలలలోపు చర్యలు తీసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించిన నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలను కూడా అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో సోమవారం స్వయంగా పిటిషన్ దాఖలు చేయనున్నారు కేటీఆర్.