తీరనున్న ట్రాఫిక్ కష్టాలు… అందుబాటులోకి బాలాన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్

-

హైదరాబాద్‌‌లోని ప్రధాన సమస్యల్లో ఒకటి ట్రాఫిక్ సమస్య. నిత్యం లక్షల మంది నగరంలో తిరుగుతుండడంతో బయటకు వెళ్దామంటే ప్రజలను ట్రాఫిక్ సమస్య ఇబ్బందులు పెడుతోంది.అయితే హైదరాబాద్‌‌లో ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం… ఆ సమస్యను తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఫ్లైఓవ‌ర్లు, అండర్ పాస్ లు నిర్మిస్తుంది. ఇప్పటికే పలు ఫ్లైఓవ‌ర్లు, అండర్ పాస్ లను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా బాలాన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్ ( Balanagar Flyover ) ను ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేసింది.

బాలాన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్ | Balanagar Flyoverజులై 6వ తేదీన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బాలాన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్ ను ప్రారంభించనున్నారని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. శుక్రవారం బాలానగర్ ఫ్లైఓవర్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఇప్పటికే దాదాపు 99 శాతం పనులు పూర్తి అయ్యాయని వెల్లడించారు. చాలా కాలంగా ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్న బాలానగర్ వాసుల కష్టాలు ఇక తీరనున్నాయని అన్నారు.

బాలానగర్ చౌరస్తా వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతూ మంత్రి కేటీఆర్ 2017లో రూ.387 కోట్లతో ఈ ఫ్లైఓవ‌ర్ కు శంకుస్థాపన చేయగా… మూడున్నర ఏళ్లకు దీని నిర్మాణం పూర్తయింది. మొత్తం ఆరు లైన్లతో 1.13 కిలోమీటర్ల పొడవుతో ఈ వంతెనను నిర్మించారు.

16 లింకు రోడ్డులు పూర్తి.. ఇక ట్రాఫిక్ స‌మ‌స్యకు చెక్

Read more RELATED
Recommended to you

Exit mobile version