సీఎం కేసీఆర్‌కు కేటీఆర్ ధన్యవాదాలు.. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే

-

నూతన జోనల్ వ్యవస్థ ఆమోదంతో స్థానికులకే ఉద్యోగాలు రానున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ నూతన జోనల్ వ్యవస్థను ఆమోదించిన సీఎం కేసీఆర్‌ కు, తెలంగాణ ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఎలాంటి వివక్ష లేకుండా సమాన అవకాశాలు దక్కుతాయని స్పష్టం చేశారు. ఈ నూతన జోనల్ వ్యవస్థ కారణంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే దక్కుతాయని పేర్కొన్నారు.

మరోవైపు ప్రైవేటు రంగంలోనూ స్థానికులకు ఉద్యోగాలు ఇస్తే ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేసారు మంత్రి కేటీఆర్‌.  ప్రభుత్వ, ప్రైవేటు రంగం రెండిటిలో స్థానికులకే సింహభాగం ఉద్యోగాలు దక్కాలన్న స్ఫూర్తితో పనిచేస్తున్నమని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. కాగా… తెలంగాణలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కొత్త జోనల్‌ విధానం ఇటీవలే అమల్లోకి వచ్చింది. జోనల్‌ వ్యవస్థలో మార్పులు, చేర్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్ర హోం శాఖ ఆమోద ముద్ర వేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version