కరెంట్‌బిల్లుల్ని టెన్‌జనపథ్‌కు మళ్లించే కార్యక్రమం చేపడతాం : కేటీఆర్‌

-

ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ ఇస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే ఉచిత్ విద్యుత్ ఇస్తామని చెప్పి.. ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఏంటని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీని కేటీఆర్ తాజాగా గుర్తు చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విటర్) వేదికగా మాజీ మంత్రి కేటీఆర్.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ట్యాగ్‌ చేశారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఎన్నికల సమయంలో చేసిన ప్రకటనల వీడియోలను ఈ పోస్టుకు జత చేశారు. నవంబర్‌, డిసెంబర్‌ విద్యుత్‌ బిల్లులు కట్టొద్దని చెప్పారని, చెల్లింపు బాధ్యత  సోనియా గాంధీ తీసుకుంటారని హామీ ఇచ్చారని కేటీఆర్‌ ట్వీట్లో పేర్కొన్నారు. కరెంట్‌ బిల్లులు చెల్లించకపోతే ఎలాంటి ఒత్తిడి తీసుకురావొద్దని డిస్కంలను ఆదేశించాలని ఈ సందర్భంగా భట్టి విక్రమార్కను కోరారు. ఒకవేళ విద్యుత్ బిల్లులు చెల్లించాలని ఒత్తిడి తెస్తే విద్యుత్‌ బిల్లుల్ని టెన్‌ జన్‌పథ్‌కు మళ్లించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version