అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి ప్రదీప్‌ను పరామర్శించారు కేటీఆర్. మేడ్చల్ జిల్లా తెలంగాణ ఉద్యమ నాయకుడి కుమారుడు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త శేషు కుమారుడికి వైద్యం చేయించుకోలేని పరిస్థితిని గమనించి, ప్రదీప్ వైద్యం కోసం లక్ష రూపాయల చెక్ అందించారు కేటీఆర్. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
ఇక అంతకు ముందు రేవంత్ సర్కార్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఘట్‌కేసర్‌లో నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలన్నారు. కేంద్రంలో బీజేపీని అడ్డుకోగలిగేది ప్రాంతీయ పార్టీలేనని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తాశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే గ్యారంటీలను అమలు చేస్తామంటున్నారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, గ్యారెంటీలు అమలు చేసేది లేదని చెప్పారు.