తన అరెస్ట్‌ వార్తలపై కేటీఆర్ ట్వీట్…గుడ్ లక్ చిట్టినాయుడు..!

-

తన అరెస్ట్‌ వార్తలపై కేటీఆర్ ట్వీట్ చేశారు…గుడ్ లక్ చిట్టినాయుడు అంటూ చురకలు అంటించారు కేటీఆర్‌. తనపై నమోదైన కేసులపై కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. శునకానందం పొందాలనుకుంటే.. నీ ఖర్మ అంటూ రేవంత్ రెడ్డిని హెచ్చరించారు కేటీఆర్‌.

KTR’s tweet on the news of his arrest

30 సార్లు ఢిల్లీకి పోయినా పైసలు తేలేదు కానీ, 3 కేసులు పెట్టావంటూ ట్వీట్ చేశారు కేటీఆర్‌. బీజేపీతో కాళ్ళ బేరాలు, జైపూర్‌లో అదానితో డిన్నర్ రిజల్ట్ ఇదేనంటూ సెటైర్లు పేల్చారు. గుడ్ లక్ చిట్టినాయుడు.. లీగల్‌గానే నిన్ను ఎదుర్కుంటానంటూ ఛాలెంజ్ విసిరారు కేటీఆర్.

కాగా… కేటీఆర్ E-ఫార్ములా రేసు పై విచారణకు గవర్నర్ ఆమోదం ఇచ్చారని కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ- కారు రేస్ అంశంలో గవర్నర్ న్యాయ నిపుణుల సలహా తీసుకొని ఆమోదం తెలిపారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. E-ఫార్ములా రేసు కేసులో కేటీఆర్‌ ను అరెస్ట్‌ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version