ఎమ్మెల్యేగా నేడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

-

మునుగోడు ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ నియోజకవర్గ శాసనసభ్యుడిగా కూసుకుంట్ల ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఛాంబర్‌లో ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై కూసుకుంట్ల ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. రాజ్‌గోపాల్ రెడ్డి రాజీనామాతో వచ్చిన ఉపఎన్నిక టీఆర్ఎస్ పార్టీ వామపక్షాల మద్దతుతో గెలుపు సాధించింది.

మునుగోడు ఉపఎన్నికలో విజయం సాధించిన తర్వాత కూసుకుంట్ల సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ ఉపఎన్నికల్లో తనకు అవకాశం ఇచ్చి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపఎన్నికలో మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కార్యాచరణ మొదలు పెట్టాలని కేసీఆర్‌ సూచించారు. అధికారులతో సమన్వయం చేసుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి జగదీశ్‌ రెడ్డికి చెప్పారు. టీఆర్ఎస్‌పై నమ్మకంతోనే ప్రజలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించారని సీఎం అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version