వరంగల్‍ ఎంజీఎంలో దారుణ పరిస్థితులు – విజయశాంతి ట్వీట్‌

-

ఎంజీఎంలో రోగులు… అరిగోసలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విజయశాంతి. వరంగల్‍ కు పెద్దదిక్కైన ఎంజీఎం ఆసుపత్రిలో రోగులు పడుతున్న బాధలు వర్ణాతీతం. ఎంజీఎంకు వచ్చే పేషెంట్లు టెస్టులు, స్కానింగ్‍ చేయించుకోవడానికి అరిగోస పడుతున్నారు. ఓపీ కోసం ఉదయం ఆరు గంటలకు వచ్చి లైన్లలో నిలబడే పేషెంట్లు టెస్టుల కోసం ల్యాబ్‍లు, ఎక్స్​రే సెంటర్ల వద్ద వీల్‍ చైర్లు, స్ట్రెచర్లపై గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు.

వృద్ధులైతే ఓపిక లేక కిందనే కూర్చుంటున్నారు. ట్రీట్‍మెంట్‍ కోసం ఎంజీఎంకు వచ్చేవారి సంఖ్య డబుల్‍ కాగా, ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయకపోవడం, మెడికల్‍ కిట్లు, సిబ్బంది లేక తిప్పలు తప్పడం లేదు. అలాగే స్టాఫ్​కూడా మధ్యాహ్నం దాటగానే ‘టైం అయిపోయింది. తెల్లారి రండి’ అనే సమాధానం చెప్పి పంపిస్తున్నారు. దీంతో వందల కిలోమీటర్ల నుంచి వచ్చి గంటలకొద్దీ లైన్లలో ఎదురుచూసిన పేషెంట్లు ఏం చేయాలో తెలియక ప్రైవేటుకు పోవడమో, ఇంటికి వచ్చి మళ్లీ రావడమో చేస్తున్నారు. ఇలా రోగులు ఇన్ని బాధలు పడుతుంటే.. ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తుంది. ఇప్పటికైనా వరంగల్ ఎంజీఎం గురించి ప్రభుత్వం దృష్టి సారించాలని బిజెపి తరఫున డిమాండ్ చేస్తున్నాను. ప్రజల బతుకులతో ఆటలాడుతున్న కేసీఆర్ గారి సర్కార్ కు తెలంగాణ ప్రజానికమే తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version